'త్వరలో ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు' - tadepalli
త్వరలోనే వైకాపా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు.
ఎమ్మెల్యేలకూ ముఖ్యమైన నామినేటెడ్ పదవులు
తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌ను వైకాపా నేత వై.వి.సుబ్బారెడ్డి కలిశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నామినేటెడ్ పదవుల భర్తీ ఉండవచ్చని అన్నారు. ఎమ్మెల్యేలకూ ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఇస్తారని తెలిపారు.