నాగార్జున సాగర్ జలాశయంలో లాంచీలను తిప్పడానికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయపురి సౌత్‌లో లాంచీ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. లాంచీల లైసెన్స్, ఫిట్నెస్ పత్రాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా లాంచీలు నడపరాదని లాంచీ మేనేజర్ స్వామికి సూచించారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన లాంచీలు ఏపీలోకి రావడానికి ఎటువంటి అనుమతులు లేవన్నారు.
'అనుమతులు లేకుండా సాగర్ జలాశయంలో లాంచీలు తిప్పరాదు' - నాగార్జున సాగర్ డ్యాం తాజా వార్తలు
సాగర్ జలాశయంలో అనుమతులు లేకుండా లాంచీలు తిప్పడానికి వీలు లేదని మాచర్ల గ్రామీణ సీఐ తెలిపారు. విజయపురి సౌత్‌లో లాంచీ స్టేషన్‌ను పరిశీలించి లాంచీ మేనేజర్ స్వామికి సూచనలు చేశారు.
మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి