ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిలే ఇళ్లు....చెప్పెను కబుర్లు

నవ్యాంధ్ర రాజధానిలో ఆధునిక సాంకేతిక పద్ధతులతో గృహాలు నిర్మిస్తున్నారు.

new model house

By

Published : Feb 1, 2019, 6:30 AM IST

ఇళ్లు కదలటం ఏంటి అనుకుంటున్నారా ...ఐతే గుంటూరు వచ్చి చూడండి...ఇళ్లతో పాటు కదిలే కార్యాలయాలు కూడా చూస్తారు. నవ్యాంధ్రప్రదేశ్​కు గుంటూరు రాజధానిగా మారాక.... నివాసాలు, కార్యాలయాల కోసం డిమాండ్ ఏర్పడింది. ఆకాశన్నింటిన భూముల ధరలకు తోడు పెరిగిన నిర్మాణ వ్యయానికి శాశ్వత గృహాలు నిర్మించుకోవాలంటే ప్రజలకు అదనపు భారం అవుతుంది. దీనిని గమనించిన ఏఎం ఆఫీస్ సొల్యూషన్స్ అనే సంస్థ తక్కువ ధరకే.... శాశ్వత గృహాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆధునిక సౌకర్యాలతో ఎం.ఎస్. ప్యాబ్రికేటెడ్ ఇళ్లు, ఆఫీసుల నిర్మాణం చేపట్టింది.

లారీ కంటైనర్లను పోలిన రీతిలో ఉండే ఇళ్లు, కార్యాలయాలు నిర్మిస్తుంది. వినియోగదారునికి అవసరమైన విధంగా సింగిల్, డబుల్ బెడ్ రూములు, ఆఫీస్ కార్యాలయాలు, సెక్యూరిటీ క్యాబిన్లను తయారు చేస్తోంది. చుట్టూ సీలింగ్, సైడ్ వాల్స్, విండోస్, ప్యాన్లు, లైట్లు, విండోస్ ఫ్లోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తుంది. బహుళ ప్రయోజనాలున్న ఈ నిర్మాణాలకు డిమాండ్ పెరుగుతోందని సంస్థ ఛైర్మన్ షేక్ హైదర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

house

అసలు ఇంటికి తీసిపోని రీతిలో నిర్మాణమవుతున్న ప్యాబ్రికేటెడ్ కార్యాలయాల పై ప్రముఖ నిర్మాణ సంస్థలు, రొయ్యల చెరువు రైతులు, రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తి చూపుతున్నారు. స్వేచ్ఛగా తరలించే అవకాశం...వేరేవాళ్లకి అమ్ముకునే సౌకర్యం , తక్కువ సమయంలో నిర్మాణ పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details