గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. కొత్తగా 364 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 70వేల 750కు చేరినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 73 నిర్ధరణ అయ్యాయి. తెనాలిలో 27 కేసులు, తాడేపల్లి 22, మంగళగిరిలో 19, నరసరావుపేటలో 17, బాపట్లలో 15, రేపల్లెలో 11, చిలకలూరిపేట, తుళ్లూరు, సత్తెనపల్లిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.
గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాల్లోని కేసుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 66వేల 162మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ బారినపడి ఇవాళ ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 631కు చేరింది. కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్యలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది.