గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద... శ్రీ మారుతీ రామ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా నరకాసుర దహనం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దీపావళి పండుగతో నరకాసురుని వలె కొవిడ్ మహమ్మారి దహనమైపోవాలని... ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని దేవాలయ అర్చకులు దీవించారు.
బాపట్లలో నరకాసుర దహన వేడుకలు - గుంటూరు జిల్లా బాపట్లలో నరకాసుర దహన వేడుకలు
గుంటూరు జిల్లా బాపట్లలో... నరకాసుర దహన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద... శ్రీ మారుతీ రామ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరకాసురుని వలె కరోనా మహమ్మారి దహనమవ్వాలని వారు ఆకాంక్షించారు.
బాపట్లలో నరకాసుర దహన వేడుకలు