తెలుగుదేశం పార్టీ నాయకుడు నలంద కిషోర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించారో ప్రత్యక్ష సాక్షి నందిగామకి చెందిన చిరుమామిళ్ల కృష్ణ మాటల్లో అర్థం అవుతుందన్నారు. కరోనా కల్లోలం సృష్టిసున్న సమయంలో వాట్సప్ లో మెసేజ్ ఫార్వార్డ్ చేసారంటూ కిషోర్‌ని విశాఖపట్నం నుండి కర్నూలు తీసుకెళ్లి వేధించారని మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రి లో కరోనా టెస్ట్ చేయించుకుంటానని కిషోర్ చెప్పినా నిరాకరించిన పోలీసులు..కక్ష సాధింపులో భాగంగా తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉంచారన్నారు. ఆరోగ్యం బాలేని వ్యక్తిని మానసికంగా, శారీరకంగానూ పోలీసులు హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నలంద కిషోర్‌ది ప్రభుత్వ హత్యే: నారా లోకేశ్ - ప్రభుత్వంపై నారా లోకేష్ మండిపాటు
నలంద కిషోర్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కిషోర్‌ది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని.. శారీరకంగా, మానసికంగా పోలీసులు హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ తొత్తుల్లా కొంతమంది పోలీసులు చేస్తున్న అరాచకాలు చూస్తున్నామన్న లోకేశ్ ...,శిరోముండనం ఘటన, మాస్క్ పెట్టుకోలేదని యువకుడిని కొట్టి చంపడం తాజా ఉదాహరణలని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛని హరించే హక్కు జగన్ రెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. కిషోర్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిందని, ఆయన మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్ష సాక్షి చిరుమామిళ్ల కృష్ణ వీడియోను లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి:ల్యాండ్, సాండ్, వైన్, మైన్ అక్రమాలపై సమాధానం చెప్పండి: దేవినేని