ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేతన్నలను ఆదుకోండి'.... సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ

చేనేత కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి 'నేతన్న నేస్తం' వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

nara lokesh
nara lokesh

By

Published : Aug 23, 2020, 4:28 PM IST

సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఉత్పత్తులకు గిరాకీ లేక రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మంగళగిరి, పొందూరు, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, నెల్లూరులోని పాతూరు ఇలా అన్ని ప్రాంతాల్లో సమస్య ఉందని చెప్పారు.

రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా చేనేత రంగం జీవనోపాధిని అందిస్తోంది. లాక్​డౌన్, ప్రకృతి వైపరీత్యాల కారణంగా 5 నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాక్​డౌన్​కు ముందు చేనేత కార్మికులు నెలకు 15 నుంచి 25 చీరలు తయారు చేసేవారు. ఒక్కో చీరకి 450 నుంచి 550 రూపాయలు సంపాదించే వారు. ఇప్పుడు నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నేతన్న నేస్తం' పథకం లబ్ధిదారులందరికీ అందడం లేదు. మంగళగిరిలో 2,490 చేనేత కుటుంబాలకు గాను కేవలం 300 మంది మాత్రమే ప్రయోజనం పొందారు. మంగళగిరిలో చేనేత కార్మికుల పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రమంతటా ఎలా ఉందో ఊహించవచ్చు. కరోనా సంక్షోభ సమయంలో ప్రతి నేతన్న కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి 'నేతన్న నేస్తం' వర్తింపజేయాలి. సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి 1.5 లక్షల రూపాయల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలి. నేతన్న దగ్గర ఉన్న ఉత్పత్తి నిల్వలను ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలి- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details