"అమరావతిని శ్మశానం అంటూ రాక్షస ఆనందం పొందిన సీఎం జగన్, వైకాపా నాయకులు ఇప్పుడు ఆ మాటను నిజం చేయాలని చూస్తున్నారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి 95 సెంట్లు భూమి ఇచ్చి 240 రోజుల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు నాగేంద్రమ్మ మృతి చెందటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. జగన్ తన మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారనీ.. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు.
అమరావతికి భూమి ఇచ్చిన మహిళా రైతు మృతి.. లోకేష్ ఆవేదన - అమరావతి రైతు మృతి న్యూస్
అమరావతి కోసం భూమి ఇచ్చి.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి మానవత్వంతో ఆలోచించాలన్నారు.
మహిళా రైతు మృతి పట్ల లోకేష్ ఆవేదన