గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమైన తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వ అరాచకాలపై కేసులు వేసి న్యాయస్థానాల్లోనే పోరాడతామని అన్నారు. ఒకే పార్టీని లక్ష్యంగా చేసుకొని 100కుపైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలైన 12 మందిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయ వేధింపులు గతంలో ఎన్నడూ లేవన్న ఆయన..దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చూడలేదని వాపోయారు. డీఎస్పీ, ఎస్పీల నుంచి డీజీపీల వరకూ అనేక వినతులు అందజేసినా శాంతిభద్రతలు ఏమాత్రం మెరుగుపడలేదని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వ వేధింపులను ఎదుర్కోవాలి, ప్రభుత్వ బాధితులను ఎలా ఆదుకోవాలి, పార్టీ విధివిధానాల అంశాలపై లీగల్ సెల్ సభ్యులతో చర్చించారు. తెదేపా లీగల్ సెల్ ప్రతినిధులు మరింత చురుగ్గా పని చేయాలని... ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
వైకాపా అరాచకాలపై న్యాయస్థానాల్లో పోరాడుతాం
వైకాపా అరాచకాలపై కేసులు వేస్తూ న్యాయస్థానాల్లోనే పోరాడతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి కార్యాకర్తకు అండగా ఉండాలి
Last Updated : Sep 27, 2019, 11:07 AM IST