తెదేపా చలో ఆత్మకూరు నేపథ్యంలో.. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా మహిళా నేత నన్నపనేని రాజకుమారిని గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా రాజకుమారి స్టేషన్ బయట బైఠాయించారు. సీఐ సర్ది చెప్పి వారిని గదిలోకి తీసుకువెళ్లారు. అంతకు ముంది చంద్రబాబు నివాసం వద్ద నన్నపనేని రాజకుమారికి పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత ఇంటి వద్ద 144 సెక్షన్ అమలులోఉందని పోలీసులు తెలిపారు.
నన్నపనేని రాజకుమారి అరెస్టు - arrested for doing protest
చలో ఆత్మకూరుకు వెళ్లేందుకు యత్నించిన తెదేపా మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారిని పోలీసులు అడ్డుకున్నారు.
నన్నపనేని రాజకుమారి అరెస్టు