తెదేపా అధినేత చంద్రబాబుపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఖండించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నక్కా... స్పీకర్ తమ్మినేని సీతారాంని 5 సార్లు ఎమ్మెల్యేగా చేసింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తుచేశారు. స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేనిపై.. తమకు గౌరవముందని చెప్పారు. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు కావాలనే తమపై రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.
"చంద్రబాబుపై స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు" - latest news on nakka anandbabu in guntur
తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. తమ్మినేనికి ఎమ్మెల్యేగా 5 సార్లు అవకాశం ఇచ్చింది తెదేపాయేనని గుర్తు చేశారు.
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు