ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల వ్యవసాయ కళాశాలకు రావడం గర్వంగా ఉంది : నాబార్డు ఛైర్మన్ - bapatla latest news

బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్మించిన నూతన భవనాన్ని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు ప్రారంభించారు. నాబార్డ్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన ఈ కళాశాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కళాశాల అధికారులు చింతల గోవిందరాజులుకు ఘనస్వాగతం పలికారు.

nabard chairman chinthala govindharajulu tour in bapatla guntur district
నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు

By

Published : Mar 19, 2021, 8:04 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో రూ.50 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని నాబార్డ్ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు ప్రారంభించారు. కళాశాల ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ కొత్త భవనాన్ని నిర్మించారు.

ఏజీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన చింతల గోవిందరాజులు... నాబార్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి బాపట్ల కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా కళాశాల అధికారులు, అధ్యాపకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఉప సభాపతి కోన రఘుపతి, ఎంపీ బాలశౌరి, అగ్రూ ఉపకులపతి ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కళాశాలలో చదువుకుని, క్రమశిక్షణతో ఉండటం వల్లే ఈ స్థాయికి ఎదిగానని, ఈ కళాశాలకు రావటం ఎంతో గర్వకారణంగా ఉందని నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు.

ఇదీచదవండి.

మల్లెంపూడి బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details