Palvai Sravanti Morphing Photos: మునుగోడు ఉప ఎన్నిక పోరు కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తమ ఓటమి ఖాయమన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారని ట్విటర్ ద్వారా మండిపడ్డారు. మరొకపక్క పాల్వాయి స్రవంతి కూడా ఈ విషయమై స్పందించారు. ఓ ఛానల్ వాళ్లు తమపై తప్పుడు సమాచారాన్ని ప్రచురించారని.. ఆ ఛానల్‌పై పరువు నష్టం దావా వేస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఓ చానల్‌లో వచ్చిన తప్పుడు వార్త ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
"పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారు"
Palvai Sravanti Morphing Photos: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో కొన్ని ఛానళ్లు, సామాజిక మాద్యమాలల్లో దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక తరహాలోనే మునుగోడులో కూడా బీజేపీ సోషల్ మీడియాలో బరితెగించిందని విమర్శించారు.
పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన ఫొటోను.. మార్ఫింగ్ చేసి ఆ ఫోటోతో.. ఫేక్ ఫోటో క్రియేట్‌చేసి కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచురించారని ఆరోపించారు. తాను విలువలతో కూడిన నాయకురాలినని.. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటి వరకు తాను కేసీఆర్‌ను కలువలేదని ఆమె స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: