గుంటూరు జిల్లా నందివేలుగు రోడ్డులో కొల్లి శారదా కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న... కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం కూల్చివేశారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం కూల్చివేయాలని నగరపాలక సంస్థ అధికారులు వెళ్లగా... స్థానికులు అడ్డుకున్నారు. మళ్లీ అర్ధరాత్రి వెళ్లగా... స్థానికులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసుల సమక్షంలో ఆలయాన్ని కూల్చివేశారు. తమకు వేరేచోట ఆలయానికి స్థలం కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కూల్చివేత - temple news in guntur
నందివేలుగు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణలో భాగంగా కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయాన్ని కూల్చివేశారు. సమాచారం ఇవ్వకుండా... ఆలయాన్ని కూల్చివేయడం దారుణమని స్థానికులు వాపోయారు.
కూల్చివేసిన దేవాలయం