ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్‌ ముట్టడికి మున్సిపల్​ కార్మికుల యత్నం.. భగ్నం చేసిన పోలీసులు - మున్సిపల్​ కార్మికుల నిరసన అప్​డేట్స్

గుంటూరులో మున్సిపల్​ కార్మికుల కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులను అరెస్ట్​ చేసి నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు.

municipal workers protest at guntur
municipal workers protest at guntur

By

Published : Jul 15, 2021, 1:54 PM IST

మున్సిపల్​ కార్మికులను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడికి మున్సిపల్‌ కార్మికుల పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. గుంటూరు హిందూ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కార్మికుల అనుబంధ సంఘాల నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్​కు తరలించారు. తమ సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్​ కార్యాలయానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం దారుణమని మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ ముట్టడికి మున్సిపల్‌ కార్మికుల పిలుపునిచ్చారు.

మున్సిపల్​ కార్మికులను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details