రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా.... గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల నగరవనం సమీపంలో 31వ తేదీన 5వేల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎం పర్యటన పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. అందుకు తగిన విధంగా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు. తాడేపల్లి సీఎం నివాసం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 11 గంటలకు పేరేచర్ల వస్తారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి మొక్కలు నాటుతారు. సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు.
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు - arrengements
ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు