రాష్ట్రంలోని ఉద్యాన, వ్యవసాయ శాఖల పరిధిలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జడ్పీ కార్యాలయం వద్ద ఎంపీఈఓలు నిరసన చేపట్టారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన తమను కాకుండా... వేరే వాళ్లను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయం పోస్టుల్లోనూ ఎంపీఈఓలను తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను తొలగించవద్దని కోరారు. ఎంపీఈఓల ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రాధాకృష్ణ మూర్తి తెలిపారు.
"ఎంపీఈఓలను క్రమబద్ధీకరించాలి"
ఉద్యాన, వ్యవసాయ శాఖల పరిధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని ఎంపీఈఓలు ధర్నా చేశారు. గ్రామ సచివాలయం పోస్టుల్లోనూ తమకు అవకాశమివ్వాలని కోరారు.
కాంట్రాక్టు ప్రాతిపధికన పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని ఎంపీఈఓలు ధర్నా