తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వ్యవసాయ బహుళ ప్రయోజన విస్తరణాధికారులు (ఎంపీఈవోలు) డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశం వేదికగా ప్రభుత్వానికి తమ అభ్యర్థనను తెలియజేశారు. మూడు నుంచి ఆరు నెలలుగా పెండింగులో ఉన్న బకాయిలను చెల్లించాలని కోరారు. గ్రామ సచివాలయాల్లో ఒప్పంద ఉద్యోగులుగా కొనసాగిస్తూ తర్వాత క్రమబద్దీకరించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1778 మంది ఎంపీఈవోలు ఉన్నారని, అందులోనూ మహిళలల సంఖ్యే ఎక్కువ అని తెలిపారు. ఈ-క్రాప్ బుకింగ్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమాల్లో అలుపెరుగని కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఎంపీఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరారు.