నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. కార్యాలయం వద్ద అర్బన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐడీ కార్యాలయం నుండి 200 మీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించినందుకు, అతనిపై అభియోగం నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.
సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఎంపీ రఘురామకృష్ణరాజు - cid latest news
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు... గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీ రఘురామపై అభియోగం నమోదైంది.
పోలీసుల బందోబస్తు