కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా.. గుంటూరు జిల్లా రేపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. వైద్యశాలలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
రేపల్లెలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు
రేపల్లెలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో(సీహెచ్సీ) కొవిడ్ కేర్ సెంటర్ను.. ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తీర ప్రాంతంలో కొవిడ్ బారిన పడ్డ బాధితులు.. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి నెలకొందని అన్నారు. కొన్ని సార్లు ఆలస్యం అవ్వడంతో వైద్యం అందక ప్రాణాలు కొల్పుతున్నారని ఆవేదన చెందారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీర ప్రాంతవాసులకు అందుబాటులో ఉండేలా రేపల్లె సీహెచ్సీలో కోవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
రెండ్రోజుల్లో అన్ని సౌకర్యాలు సిద్ధం