ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మరోసారి గెలిపిస్తే మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా' - ఎమ్మెల్సీ లక్ష్మణరావు తాజా న్యూస్

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని.. ఎమ్మెల్సీ లక్ష్మణరావు హామీ ఇచ్చారు. గుంటూరు ఎన్జీఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

MLC Lakshmana Rao participating in the Teachers' Spiritual Assembly program in Guntur
'మరోసారి గెలిపిస్తే మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా'

By

Published : Jan 31, 2021, 6:31 PM IST

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగనున్నాయి. గుంటూరు ఎన్జీఓ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లక్ష్మణరావు కోరారు. మరోసారి గెలిపిస్తే మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొడ్డు నాగేశ్వరరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని లక్ష్మణరావు కోరారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో చివరిరోజు భారీగా నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details