త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో తెదేపా విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. వైకాపా దౌర్జన్యాలకు భయపడకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పర్యటించిన ఆయన స్థానిక తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
మండలంలో 29 పంచాయతీలకుగానూ 11 పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులు.. సర్పంచులు విజయం సాధించడం అభినందనీయమన్నారు. విభేదాలను పక్కనపెట్టి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో విజయానికి శ్రమించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.