పల్నాడును జిల్లాగా ప్రకటిస్తున్న నేపథ్యంలో తమతమ నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. గుంటూరు జిల్లా అభివృద్ధి సమావేశం కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, బ్రహ్మనాయుడు కసరత్తు చేశారు. రెవెన్యూ డివిజన్‌ను వినుకొండలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అభిప్రాయపడ్డారు. మాచర్లలో ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాల వారికీ అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు - guntur district latest updates
కొత్త జిల్లాల ఏర్పాటుపై వైకాపా శాసన సభ్యులు గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా ఏర్పాటుపై వైకాపా ఎమ్మెల్యేల విభిన్న అభిప్రాయాలు