వరద నీరు పెరుగుతుండడం వల్ల నదీపాయల మధ్య రాకపోకలు కొనసాగించే గుంటూరు జిల్లా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడిన డా. ఉండవల్లి శ్రీదేవి....తుళ్లూరు మండలం పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం 24 గంటలు లంక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
లంక గ్రామ ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రజలు కొవిడ్-19 నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలన్నారు. ప్రజలు మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బాధితులకు పునరావాస కేంద్రాల్లో మేరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.