రైతుల ముసుగులో కొంత మంది తెదేపా కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రైతులెవ్వరూ తనపై దాడి చేయలేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్న ఆయన... రైతుల ధర్నాలో కొంతమంది ఆగంతుకులు మద్యం సేవించి తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే సీఎం ముందుకెళ్తున్నారన్నారు. తమపై దాడులెందుకు... తామేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చామా అని ప్రశ్నించారు.
'రైతుల ముసుగులో...తెదేపా కార్యకర్తలే దాడి చేశారు' - ఏపీ కాపిటెల్ న్యూస్
రాజధాని రైతుల ముసుగులో తెదేపా కార్యకర్తలే తనపై దాడి చేశారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాజధాని రైతుల్లో తెదేపా అనవసర భయాలు సృష్టిస్తోందని విమర్శించారు. తనపై జరిగిన దాడికి పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.
పిన్నెల్లి రాMla pinnellin responds attack on his carమకృష్ణా రెడ్డి