గుంటూరు జిల్లాలో శీతల గోదాముల్లో ఉంచిన మిర్చి పంట పాడైపోయిన ఘటనపై రైతులు పరిహారం కోరుతూ రోడ్డెక్కారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజి వద్ద ఆందోళనకు దిగారు. గోదాముల్లో ఏసీ పనిచేయని కారణంగా.. రైతులు దాచి ఉంచిన మిర్చి పాడైపోయింది. వారికి పరిహారం విషయంలో యాజమాన్యం నుంచి స్పందన లేదు.
2 రోజుల క్రితం రైతులు ఆందోళన చేయగా పోలీసులు వారికి సర్దిచెప్పి పంపారు. రైతులకు పరిహారం ఇవ్వాలని యజమానికి సూచించారు. అయినా శీతల గోదాము యజమాని ఆ విషయం పట్టించుకోలేదు. దీంతో రైతులు మళ్లీ మంగళవారం ధర్నా చేశారు. రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు.