RAJINI FIRES ON CBN AND LOKESH : చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కనీసం ఆలోచించలేదని మంత్రి విడదల రజని అన్నారు. అధికారం పోయాక ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. లోకేశ్ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదంటూ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మోసం చేశారో ప్రజలకు తెలుసని.. జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్.. మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. చంద్రబాబు అతని కొడుకుని నమ్మి ఎవరూ మోసపోవద్దని విడుదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా తెనాలిలో వైయస్సార్ పట్టణంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఆసుపత్రికి పోతేనే పట్టించుకోని గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా ప్రభుత్వ డాక్టర్లే గ్రామాలకు వస్తుండటం గొప్ప విషయమన్నారు.
యాత్ర ఎందుకో లోకేశ్‌కే తెలియదు.. ఈ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: విడదల రజని - ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం
MINISTER RAJINI FIRES ON LOKESH : లోకేశ్ పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని.. మంత్రి విడదల రజని అన్నారు. వైసీపీ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న ఆమె.. ప్రజలు జగన్ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెనాలిలో పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
MINISTER RAJINI FIRES ON LOKESH