అవినీతి రహిత పాలన అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వంద రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ సీఎం చెయ్యలేని విధంగా దాదాపు 85 శాతం అమలు చేశారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నామని....పేదలకు,కులవృత్తిపై ఆధారపడి న వారికి గతంలో ఎన్నడు లేని విధంగా పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల్లో తెదేపా ప్రభుత్వం క్రింది స్థాయి నుంచి భారీ ప్రాజెక్టు ల వరకు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వలనే ఇసుక విధానం పై ఆలస్యం జరిగిందని... ప్రస్తుతం ఇసుకను తక్కువ ధరకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
''వంద రోజుల పాలనలో 85 శాతం హామీలు అమలు''
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వంద రోజుల పాలనలో 85 శాతం పూర్తి చేసిన ఘనత దేశంలోనే సీఎం జగన్కు దక్కుతుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా ముఖ్యమంత్రి పాలన ఉందని గుంటూరు జిల్లా రేపల్లెలో తెలిపారు.
వంద రోజుల పాలనలో 85శాతం హామీలు అమలు: మంత్రి మోపిదేవి