గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నివారణపై మంత్రి మోపిదేవి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అదుపులోనే ఉందని చెప్పారు. నగరాలు, పట్టణాల్లో మాత్రం జనం యథేచ్ఛగా తిరుగుతున్నారని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. త్వరలో ఆక్వా అథారిటీ ఏర్పాటు చేస్తామని మోపిదేవి వెల్లడించారు. అరటి, బొప్పాయి కొనుగోలు చేసి ప్రభుత్వమే విక్రయిస్తుందని చెప్పారు.
'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అదుపులోనే ఉంది' - మోపిదేవి వెంకటరమణ
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అదుపులోనే ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వివరించారు. కరోనా వైరస్ నివారణపై మంత్రి మోపిదేవి సమీక్ష నిర్వహించారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ