వరదల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో పర్యటించిన మంత్రి... స్థానిక ఎమ్మెల్యే మెరుగు నాగార్జునతో కలిసి ఎంపీడీవో ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం లంకలోని పంటపొలాలను పరిశీలించారు. ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని...ముఖ్యమంత్రి జగన్ విదేశాల నుంచి రాగానే పంట నష్టపరిహారాన్ని 45 రోజుల్లో అందజేస్తామని మంత్రి వెల్లడించారు.
వరద బాధిత రైతులకు 45రోజుల్లో నష్టపరిహారం: మంత్రి కన్నబాబు - lanka villages
వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని... ప్రతి రైతును ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు.
వరదలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు