ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండలి రద్దుకు, రాజధాని అంశానికి సంబంధం లేదు: బొత్స - మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం

రాజధాని విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారశైలిని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. రాజధాని అంశానికి, మండలి రద్దు నిర్ణయానికి సంబంధం లేదన్నారు.

minister bosta satyanarayana press meet
బొత్స సత్యనారాయణ

By

Published : Jan 29, 2020, 4:44 PM IST

బొత్స సత్యనారాయణ

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహార శైలిని తప్పుబట్టారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలను చిత్తు కాగితాలని గతంలో చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇప్పుడు ఆ నివేదికల్లోనే.. విశాఖకు తుపాను ముప్పు ఉందని చెబుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని మండలి ఛైర్మన్​ను తాము కోరామని చెప్పారు. మండలి ఔన్నత్యానికి తూట్లు పొడవలేదని స్పష్టం చేశారు. రాజధాని అంశానికి, మండలి రద్దు నిర్ణయానికి సంబంధం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details