స్థానిక సంస్ధల ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబుకు అర్థమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని తెదేపా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమా 10 కార్లు వేసుకుని మాచర్ల వెళ్లి హల్ చల్ చేశారన్న బొత్స... అసలు వారు మాచర్ల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇతర ప్రాంతం వారు వచ్చి దుమ్ములేపుతూ, ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంటే స్థానికులు ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. తెదేపా నేతలు అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటే కుదరదని... ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెదేపా నేతలు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా నేతల రౌడీయిజం సహించం: మంత్రి బొత్స - గుంటూరులో తెదేపా నేతలపై వైకాపా దాడి తాజా వార్తలు
చంద్రబాబు రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మాచర్ల ఘటనపై స్పందించిన మంత్రి... తెదేపా నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్న 10 కార్లలో దుమ్ములేపుతూ.. దురుసుగా దూసుకెళ్లారని ఆరోపించారు. తెదేపాను పలువురు నేతలు వీడి వెళ్తున్నారనే అసహనంతోనే ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
minister-bosta-satyanarayana
Last Updated : Mar 11, 2020, 6:12 PM IST
TAGGED:
bosta