ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడుగురి కోసం 'మినీ థియేటర్‌'.. కుటుంబసభ్యులతో మాత్రమే కలిసి చూసేలా - Any Mini Theatre For Family In Hyderabad

MINI THEATRE: ''నేను థియేటర్‌లో సినిమా చూడాలంటే ఆ హాల్‌లో నా వాళ్లు తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. అరుపులు, గోలలు, ఈలలు ఏమీ నన్ను డిస్టబ్‌ చేయకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో నేను సినిమా చూడాలి. నేను సినిమా చూసేంత వరకు చుట్టుపక్కల వాతావరణమంతా ప్రశాంతంగా ఉండాలి.'' ఇలాంటి కోరికలు ఎవరికైనా ఉంటే ఓసారి ఈ థియేటర్‌కు వెళ్లండి. మీరు, మీ వాళ్లు తప్ప ఇంకెవ్వరూ లేకుండా ఆ తెరపై మీకు నచ్చిన బొమ్మను చూసి ఆనందించండి. ఇంతకీ ఆ థియేటర్‌ కథేంటి.. అది ఎక్కడ ఉందంటే..?

MINI THEATRE
మినీ థియేటర్‌

By

Published : Nov 19, 2022, 7:32 PM IST

MINI THEATRE: ప్రేక్షకులు పెద్దగా రాని థియేటర్‌లో.. కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి నచ్చిన సినిమాను చూస్తే ఆ కిక్కే వేరు.. ఇప్పుడు అలాంటి అనుభూతి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందొచ్చు.. కేవలం సినిమాలే కాదు క్రికెట్‌ మ్యాచ్‌లు, పెళ్లి వీడియోలు, బర్త్‌డే పార్టీలు, ఆత్మీయ సమావేశాలు, ఓటీటీ సినిమాలు ఇలా ఇంకెన్నో.. నగరంలోని ప్రజలకు ‘స్టార్‌ ట్రాక్‌’ సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. ఇళ్లు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలు తదితర ప్రాంతాల్లో విలాసవంతమైన థియేటర్లను డిజైన్‌ చేసే ఈ సంస్థ.. సికింద్రాబాద్‌లోని కార్యాలయంలో ఈ ‘డెమో’ థియేటర్‌ అనుభవాన్ని కల్పిస్తోంది.

మినీ థియేటర్‌

సుమారు 143 అంగుళాల స్క్రీన్‌, 15 స్పీకర్‌ సిస్టమ్‌లు, విలాసవంతమైన రిక్లైనర్స్‌, భద్రత దృష్ట్యా సెక్యూరిటీ కెమెరాలనూ ఏర్పాటు చేశారు. డెమో అనుభూతిని పొందాలనుకునేవారు కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చి నచ్చిన ఓటీటీలు, సినిమాలు చూడవచ్చు. మొత్తం ఏడుగురు ఒకేసారి కూర్చొని మినీ థియేటర్‌ అనుభవాన్ని పొందొచ్చు. రోజు ఉదయం వేళ నాలుగు గంటల పాటు ఇందులో గడిపేందుకు రూ.1500 ఛార్జీ వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే రూ.1700 వరకు ఛార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో బుక్‌ చేసుకోవాలంటే రూ.1700, వారాంతాల్లో అయితే రూ.1900 వరకు ఛార్జీ అవుతోంది. నచ్చిన వారు ఆర్డర్‌ ఇస్తే వారింట్లోనూ ఈ తరహా డిజైన్లు ఏర్పాటు చేస్తారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details