Michaung Cyclone Affect in All Over Andhra Pradesh: మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ ప్రారంభమైంది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో తుఫాను ప్రభావం నెల్లూరులో ప్రారంభమైంది. అంతేకాకుండా రాగల మూడు రోజుల్లో ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, గుంటూరు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ప్రజలు తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు.
తుఫాను ప్రభావంతో తీరప్రాంతంలో 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 1 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం చెన్నైకి సుమారు 300 కి.మీ, నెల్లూరుకు 430కి.మీ దూరానికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో రాష్ట్ర తీరం వైపు తుపాను కదులుతొంది.
LIVE : అసెంబ్లీ ఎన్నికలు 2023 తీర్పు - ప్రత్యక్షప్రసారం || assembly election results 2023
బీ అలర్ట్ - తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - భారీగా కురుస్తున్న వర్షాలు
Michaung Cyclone Affect in Nellore: మిచౌంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంలో మిచౌంగ్ తుపాను ప్రభావం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలోని కావలి, ఆత్మకూరు, కోవూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా నెల్లూరులో కుండపోతగా వర్షం కురిసింది. గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, పొగతోట ప్రాంతాల్లో రోడ్లమీద వరదనీరు ప్రవహిస్తోంది. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి సమీపంలో.. నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో (Rain In Nellore) వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.