గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సంబంధించి అదనపు పరిశీలకుడిని నియమించాలంటూ.. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం అందించారు. లెక్కింపు సమయంలో తెదేపా నేతలు గొడవలు సృష్టించే అవకాశముందని పేర్కొన్నారు. తెదేపా నాయకులు ఎన్నికల సంఘాన్నే బెదిరిస్తున్నారనీ.. ఇక్కడ కౌంటింగ్ సిబ్బందిని భయపట్టే అవకాశముందని ఆరోపించారు. మంగళగిరిలో తన ప్రత్యర్థి ముఖ్యమంత్రి తనయుడు కాబట్టి ఫలితాలను తారుమారు చేసే అవకాశముందన్నారు. అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలని కోరారు.
ద్వివేదికి వైకాపా ఎమ్మెల్యే ఆర్.కే వినతిపత్రం
మంగళగిరి ఓట్ల లెక్కింపు సమయంలో తెదేపా నేతలు గొడవలు సృష్టించే అవకాశముందనీ.. అందుకే అదనపు పరిశీలకుడిని నియమించాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఈఓ ద్వివేదికి వినతిపత్రం సమర్పించారు.
ద్వివేదికి వైకాపా ఎమ్మెల్యే ఆర్.కే వినతిపత్రం