ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణపై జగన్​ మాట తప్పారు: మంద కృష్ణ మాదిగ - manda krishna madiga

ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

మంద కృష్ణ మాదిగ

By

Published : Jul 20, 2019, 3:06 PM IST

మంద కృష్ణ మాదిగ

శాంతియుత పాదయాత్రకు అనుమతి నిరాకరించడం సీఎం జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని మందకృష్ణ మాదిగ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్‌ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకుని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి... కేంద్రానికి పంపాలని కోరారు. లేనిపక్షంలో జులై 22 నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ల వద్ద నిరవధిక దీక్షలు నిర్వహిస్తామని, 29న అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోతే... 30 తేదీన అసెంబ్లీ ఎదుట నిరసన చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి..అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details