తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గోపి వారం రోజుల కిందట రైలు ప్రమాదంలో గాయపడ్డాడు. విజయవాడలో ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చటంతో వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి వచ్చాడు. రెండ్రోజుల పాటు అక్కడ వైద్యం చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి ఆసుపత్రి ప్రహరీ గోడపక్కన ప్రత్యక్షమయ్యాడు. ఐదురోజులుగా గాయాల నొప్పులను భరిస్తూ... ఆకలి బాధను తట్టుకుంటూ అచేతనంగా ఉండిపోయాడు. అటుగా వెళ్తున్న ఈటీవీ భారత్ ప్రతినిధి బాధితుడిని పలకరించటంతో తన దీనస్థితిని తెలిపారు. తనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, గాయాల నొప్పులను తట్టుకోలేకపోతున్నానని బాధితుడు వాపోయాడు. చెంతనే సర్కారు ఆసుపత్రి ఉన్నా... చేర్పించి వైద్యం చేయించేవారులేక ఆ వ్యక్తి నరకయాతనను అనుభవిస్తున్నాడు.
ఆసుపత్రి పక్కనే ఉన్నా.. వైద్యం అందని అభాగ్యుడు..! - గుంటూరు తాజా వార్తలు
అనుకోని ప్రమాదం ఆ వ్యక్తిని తీవ్రంగా గాయపరచింది. ఇతరుల సాయం లేనిదే పక్కకు కూడా కదలలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఐదురోజులకు పైబడి రోడ్డుపక్కన ప్లాట్‌ఫామే అతనికి ఆవాసమైంది. ఓ వైపు ఆకలి..మరోవైపు గాయాల నొప్పులను ఓర్చుకుంటూ దారిన వచ్చిపోయే వారిని ఆసుపత్రిలో చేర్పించాలని వేడుకుంటున్నాడు ఆ అభాగ్యుడు. గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్రాసుపత్రి ప్రహరీ పక్కనే జరిగిందీ ఘటన.
ఆసుపత్రి చెంతనే ఉన్నా వైద్యం అభాగ్యుడు..!!
Last Updated : Aug 5, 2020, 9:20 AM IST