గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన తూమాటి సుబ్బారావుకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో నాలుగెకరాలను తన నలుగురు కుమారులకు పంచాడు. మిగతా భూమిని తనవద్దే ఉంచుకుని, రెండో కుమారుడు తుమాటి ఆదెయ్య వద్ద ఉంటున్నాడు. మూడో కుమారుడు వెంకటేశ్వరరావు, నాలుగో కుమారుడు గోవిందయ్యలు సుబ్బారావు వద్దకు వచ్చి భూమి పంచాలంటూ ఘర్షణకు దిగారు. సహనం కోల్పోయిన కుమారులు... సుబ్బారావుపై కర్రతో దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సుబ్బారావును ఆస్పత్రికి తరలిస్తండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆదెయ్య భార్య ఉమామహేశ్వరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం: ఆస్తి కోసం కన్నతండ్రిని చంపిన కుమారులు - murder in garikapadu
గుంటూరు జిల్లా గరికపాడులో విషాదం జరిగింది. ఆస్తికోసం కన్నకొడుకులే తండ్రిని హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆస్తి కోసం కన్నతండ్రిని హతమార్చిన కుమారులు