గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన కాశిమాల శివయ్యగా గుర్తించారు.
బంధువుల ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న తాడికొండ పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలుసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.