ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో ఈత కోసం దిగి.. యువకుడు మృతి - shingunipalem man death news

గుంటూరు జిల్లా శింగుపాలంలో విషాదం జరిగింది. ఈతకోసం చెరువులోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

one died
యువకుడు మృతి

By

Published : Sep 14, 2020, 11:30 PM IST

గుంటూరు జిల్లా రేపల్లే మండలం శింగుపాలెం యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. శింగుపాలెం హరిజనవాడకి చెందిన గూడవల్లి పృథ్వి పంచాయతీ చెరువులో ఈతకు దిగి.. ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పృథ్విని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు పట్టణంలో ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పని చేస్తున్నాడనీ.. పది ఏళ్ల క్రితం తండ్రి చనిపోయాడని ఎస్సై ఫిరోజ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details