కోర్టు సమీపంలోనే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తిని అధ్యాపకుడిగా గుర్తించారు. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అప్పుల బాధ తాళలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు చెప్పారు.
కోర్టు సమీపంలోనే.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు! - guntur
08:40 January 06
తెనాలిలో వ్యక్తి ఆత్మహత్య
పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లూరి జకరయ్య (50) స్థానిక అంబేద్కర్ ఎయిడెడ్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన అనేక అప్పులు చేశారు. అయితే.. వడ్డీలు కడుతూ బాకీలు చెల్లిస్తున్నా.. అప్పులు తీరలేదు. ఆప్పులు ఇచ్చినవాళ్లు.. పదే పదే ఇబ్బందులు పెట్టడంతోపాటు అతనిపై కేసులు కూడా పెట్టారు. దీంతో కోర్టు వాయిదాలకూ తిరుగుతున్నారు.
ఈ ఇబ్బందులు తాళలేని జకరయ్య.. ఆత్మహత్య చేసుకోవడమై పరిష్కారంగా భావించాడు. ఈ క్రమంలో.. మార్నింగా వాక్ పేరుతో ఇంటి నుంచి బయటకు వచ్చిన జకరయ్య.. ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ఒకటో పట్టణ సీఐ కొమ్మలపాటి చంద్రశేఖర్ తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శవపరీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: