గుంటూరు జిల్లా తెనాలిలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలోని సుల్తానాబాద్‌లో బాలాజీ నాయక్ అనే వ్యక్తి మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు దాడి చేసి బాలాజీ నాయక్ నుంచి 243 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఎమ్మార్పీ ప్రకారమే 2 లక్షల రూపాయలు ఉందని పోలీసులు తెలిపారు. ఇక్కడ అంతకు రెట్టింపు ధరలతో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏపీలో తమకు నచ్చిన మద్యం బ్రాండ్లు దొరక్కపోవటం, పైగా ధరలు అధికంగా ఉండటంతో తెలంగాణ మద్యానికి ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను అవకాశంగా మార్చుకుని కొందరు తెలంగాణ మద్యం ఇక్కడకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు జరిపినప్పుడు పట్టుబడుతున్నారు.
తెనాలిలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - telangana liquor seized in tenali
గుంటూరు జిల్లా తెనాలిలో తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 243 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతోనే తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని కొనుగోళ్లు చేసి అక్రమంగా లాభాలు పొందుతున్నారు.
తెనాలిలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
TAGGED:
ఏపీలో తెలంగాణ మద్యం వార్తలు