ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భౌతికదూరం లేకపోతే ఇక్కడ సీసా దొరకదంతే..!

కరోనా వైరస్​ను పూర్తిగా నిర్మూలించేందుకు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని... గుంటూరు జిల్లా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రేపల్లె పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపులను ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించి మద్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ వివరించారు.

By

Published : May 5, 2020, 8:57 PM IST

maintaing social distance in guntur dst baptla wine shops
maintaing social distance in guntur dst baptla wine shops

గుంటూరు జిల్లా రేపల్లే పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. మద్యం షాపులు వద్ద సున్నాలతో గిరి ఏర్పాటు చేసి... ఏ ఒక్కరు దగ్గరాగ ఉండకుండా చూస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పొన్నూరులో నమోదు అయిన 3 కరోనా కేసులు వైద్యం అనంతరం నెగిటివ్ రావడంతో... ఆసుపత్రి నుంచి వచ్చి హోమ్ క్వారన్​టైన్​లో ఉంటున్నారని చెప్పారు.

అత్యవసర, వ్యవసాయ రంగం వాహనాలు మినహా వేరేవాటిని ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి అనుమతించటం లేదని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు, అధికారులకు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండిమరణంలోనూ వీడని తోటికోడళ్ల బంధం

ABOUT THE AUTHOR

...view details