ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి రచయితకు మహారాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం - తెనాలి రచయితకు మహారాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం

తెనాలి రచయిత షేక్​ అబ్దుల్​ జాని రచనలకు రెండవ ఏడాది అరుదైన గౌరవం లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు మాధ్యమం విద్యార్థులకు బోధించే యువభారతి పాఠ్య పుస్తకంలో ఈయన రచనకు చోటు దక్కింది. గతేడాది 11వ తరగతి తెలుగు మాధ్యమం పాఠ్యపుస్తకంలో ఈయన రచన చేసిన బాధ్యతాయుత పౌరుడు కథను సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది.

Maharashtra government second time honoured tenali writer
తెనాలి రచయిత షేక్​ అబ్దుల్​ జాని

By

Published : Aug 25, 2020, 12:50 AM IST

తెనాలి రచయిత షేక్​ అబ్దుల్​ జాని రచనకు మంచి గౌరవం దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి 12వ తరగతి తెలుగు మాధ్యమం విద్యార్థుల కోసం 2020-21 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన యువ భారతి పాఠ్య పుస్తకంలో ఈయన రచనకు చోటు దక్కింది. ఆయన రాసిన అమ్మఒడి కథల సంపుటిలోని కొత్త వెలుగు కథను ఈ పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు.

షేక్​ అబ్దుల్​ జాని రచనలు ప్రచురణ

గతేడాది హకీం రచించిన 'బాధ్యతాయుత పౌరుడు' కథను 11వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. రెండో ఏడాది ఆయనకు వరుసగా ఈ గౌరవం దక్కింది. తన కథను ఎంపిక చేసిన కమిటీ ప్రతినిధులకు హకీం జానీ కృతజ్ఞతలు తెలిపారు. పుణే ప్రధాన కార్యాలయంగా ఉన్న మహారాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మాత, పాఠ్య ప్రణాళిక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ పుస్తకం ప్రచురితమైంది.

షేక్​ అబ్దుల్​ జాని రచనలు ప్రచురణ

రచయిత పరిచయాన్ని సైతం పాఠ్యాంశం చివరిలో పొందు పరిచారు. బాలసాహిత్యంలో హకీం జానీ ఇప్పటివరకు 250 కథలు, 33 వయోజన వాచకాలు, 30 బాలసాహిత్య పుస్తకాలు, 4 గ్రంథాలు వెరసి 68 పుస్తకాలను రచించారు.

షేక్​ అబ్దుల్​ జాని రచనలు ప్రచురణ
షేక్​ అబ్దుల్​ జాని రచనలు ప్రచురణ

ఇదీ చదవండి :

ఐఐటీ చదువు.. పొలంలో కొలువు

ABOUT THE AUTHOR

...view details