ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘోర ప్రమాదం జనంపైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి - గుంటూరు జిల్లాలో లారీ ప్రమాదం

తొందరగా పనులు ముగించుకొని శివుని దర్శించుకుని వద్దామనుకున్నా వారిని లారీ మృత్యు రూపంలో కబళించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు, మరో ఐదుమందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుుంటూరు జిల్లా చిలకలూరిపేట యడ్లపాడు వద్ద జరిగింది.

ఘోర ప్రమాదం జనంపైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి

By

Published : Nov 12, 2019, 11:55 AM IST

ఘోర ప్రమాదం జనంపైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం సమీపంలో రోడ్డుపై నిలుచుకున్న వారిపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కల్పతరు స్పిన్నింగ్‌ మిల్లుకు చెందిన కార్మికులుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో నరేష్ , భవానీ , జితేంద్ర దాసుతో పాటు.. భూమిక, యామిని అనే ఇద్దరు చిన్నారులున్నారు. చిన్నారుల పరిస్థితి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబాలతో కలిసి చిలకలూరిపేటలోని శివాలయానికి బయలుదేరారు... బస్సు కోసం రోడ్డు పక్కన వేచిఉన్న సమయంలో ఐరన్ లోడ్ లారీ డివైడర్​ను ఢీకొట్టి వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో దైవదర్శనానికి వెళ్తున్న వారు మృత్యువాత పడాల్సి వచ్చింది. డ్రైవర్‌ అతివేగంగా లారీని నడపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details