గుంటుూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. తిమ్మాపురంలోని కల్పతరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు కార్తీక సోమవారం అయినందున కుటుంబాలతో కలిసి చిలకలూరిపేటలోని శివాలయానికి బయలుదేరారు. బస్సు కోసం రోడ్డు పక్కన వేచి ఉన్న సమయంలో వేగంగా వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టి వీరిపైకి దూసుకెళ్లింది. దైవదర్శనానికి వెళ్తున్న వారు మృత్యువాత పడాల్సి వచ్చింది. వీరంతా ఒడిశాకు చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్సకు ముగ్గురిని గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
డివైడర్ను ఢీకొట్టి జనాలపైకి వెళ్లిన లారీ.. ముగ్గురు మృతి - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
గుంటుూరు జిల్లా తిమ్మాపురం వద్ద రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
డివైడర్ను ఢీకొట్టి జనాలపైకి వెళ్లిన లారీ