ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 15, 2020, 1:46 PM IST

ETV Bharat / state

'రైతు కుటుంబ సభ్యులకు పరిహారం అందివ్వాలి'

బాపట్లలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని తెదేపా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Compensation should be given to the family members of the farmer who committed suicide
'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు పరిహారం అందివ్వాలి'

గుంటూరు బాపట్ల వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.15లక్షలు పరిహారం అందించాలని తెదేపా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్​చేశారు. కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో మృతి చెందిన శ్రీహరి కుటుంబ సభ్యులను గుంటూరు పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి, పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీహరి ప్రతి ఏడాది 25 ఎకరాల వరకు పంటలు సాగు చేసేవారని.. ఈ ఏడాది పత్తి, మిర్చి సాగు చేయగా.. నివర్ తుపాన్​ వల్ల పూర్తిగా నష్టపోయాడని చెప్పారు. ఆత్మనిర్భరం కోల్పోయిన రైతు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చేలా పోరాడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details