జషిత్ ఆచూకీని కనిపెట్టండి.. లోకేశ్ ట్వీట్ - jasith
మండపేటలో కిడ్నాపైన బాలుడు జషిత్ ఆచూకీని ప్రభుత్వం వీలైనంత త్వరగా కనిపెట్టి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
జషిత్ ఆచూకీని కనిపెట్టండి-లోకేశ్ ట్వీట్
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాపైన ఐదేళ్ళ జషిత్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని కోరుతూ.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నానమ్మను కొట్టి మరీ ఆమె చేతుల్లో నుంచి బాబును తీసుకెళ్ళడం దారుణమన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా జషిత్ ఆచూకీ కనిపెట్టి.. ఆ తల్లిదండ్రుల ఆవేదన తీర్చాలని కోరారు.