ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి: లోకేశ్​ - పారిశుద్ధ్య కార్మికుల వార్తలు

సీఆర్డీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ మంత్రి బొత్సకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. సిబ్బందికి గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం ఆవేదన కలిగిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

lokesh letter to bosta for labors
lokesh letter to bosta for labors

By

Published : May 8, 2020, 5:55 PM IST

కరోనా నివారణకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. సీఆర్డీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు.. ప్రభుత్వం తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణకు లోకేశ్​ లేఖ రాశారు. వారికి పీపీఈ కిట్లు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చాలాసార్లు పారిశుద్ధ్య కార్మికుల సాధారణ పని గంటలు పొడిగిస్తున్నారని వాపోయారు. సీఆర్డీఏ గ్రామాల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం ఆవేదన కలిగించే అంశమని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వానికి కార్మికులు పలుమార్లు విన్నవించినా.. పట్టించుకోలేదని మండిపడ్డారు.

సంక్షోభ సమయంలోనూ సమ్మెలో కూర్చోవడం వారికి చివరి అస్త్రంగా మారిందని లోకేశ్​ ఆవేదన వ్యక్తంచేశారు. పెనుమక గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసనను ఈ లేఖకు జత చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. తక్షణమే వారికి జీతాలు చెల్లించేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యమని గుర్తుచేశారు. సీఆర్డీఏ ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికుల బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details