ఉన్న ఊళ్లో పని లేక వేల కిలోమీటర్లు వలస వచ్చారు. మిర్చి సీజన్లో కాయకష్టం చేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకుని వెళ్దామని అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా అంతా చిన్నాభిన్నమైంది. యార్డు మూసివేసిన కారణంగా.. పనుల్లేక పస్తులుంటున్నారు.
తమ కోసం శ్రామిక్ రైలు వేయాలని... లేదంటే ప్రభుత్వం అనుమతిస్తే తామే ఎలాగోలా వాహనాలు మాట్లాడుకుని వెళ్తామని వలస కార్మికులు అంటున్నారు. ఏపీ సీఎం జగన్, బీహార్ సీఎం నితీష్ లు తమను ఆదుకోవాలని.. బీహార్ వలస కూలీలు వేడుకుంటున్నారు.